News August 14, 2025
సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు: అయ్యన్నపాత్రుడు

AP: సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. YCP వాళ్లు వస్తారో? లేదో? క్లారిటీ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ‘అసెంబ్లీకి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? సభకు వచ్చి సమస్యలు అడగాల్సిన బాధ్యత లేదా? YCP ప్రభుత్వంలో ఐదేళ్లలో 78 రోజులే సభను నడిపించారు’ అని విమర్శించారు.
Similar News
News April 16, 2026
రామాయణ ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుంది: యశ్

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్‌స్టెల్లార్ వంటి బ్లాక్‌బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News April 16, 2026
ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు పెంపు: షా

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా LSలో విమర్శించారు. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు. దక్షిణాదిలో జనాభా రేషియో కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఏపీలో సీట్లు 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయి. కర్ణాటక, తమిళనాడులోనూ అంతే. ఇది నా గ్యారంటీ. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు.
News April 16, 2026
పంత్ ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్

RCBతో జరిగిన మ్యాచులో LSG కెప్టెన్ పంత్ ఎడమ మోచేతికి బంతి తగిలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘LSG చాలా దారుణమైన జట్టు. వాళ్ల బౌలింగ్ మాత్రమే కాస్త బాగుంది. 5 మ్యాచులు పూర్తయినా బ్యాటింగ్‌లో రాణించేలా కనిపించట్లేదు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.


