News August 14, 2025
పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

PDPL- మంథని ప్రధాన రహదారిలోని గంగాపురి స్టేజీ వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో వెంకటేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ముత్తారం రోడ్డు నుంచి మంథని- PDPL రహదారి మీదుగా రావడానికి గంగాపురి క్రాసింగ్ వద్దకు అతడు రాగా వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. ఈ మలుపు వద్ద ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు.
Similar News
News August 14, 2025
సిద్దిపేట: అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధిక వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి అధిక వర్షాల వలన ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 29 నీటి వనరులు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు.
News August 14, 2025
జిల్లాలో పెరిగిన భూగర్భ జల నీటిమట్టం: కలెక్టర్

గతేడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో భూగర్భ జలమట్టం సగటున 2.26 మీటర్ల మేర పెరిగిందని కలెక్టర్ పి.అరుణ్ బాబు సీఎం చంద్రబాబుకు వివరించారు. సాగునీటి సబ్‌మెగా సభ్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ సాగర్ ఛైర్మన్ కాంతారావుతో కలిసి పాల్గొన్నారు. భారీగా చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణాల కారణంగా వచ్చే ఏడాదికీ జలమట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
News August 14, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య: DEO

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సిద్దిపేట ఈడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణరావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతో లక్ష రూపాయల విలువైన షూలు, ఐడి కార్డులు, బెల్టులు వంటి అందజేశారు.