News August 14, 2025

రాజంపేటలో 17న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు

image

ఉమ్మడి కడప జిల్లా స్థాయి సబ్ జూనియర్స్, సీనియర్స్ ఎంపికలు ఈనెల 17న ఉదయం 9 గంటలకు రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎంపిక చేయనున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకట రమణ తెలియజేశారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29, 30, 31న ప్రకాశం జిల్లా చేవూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

Similar News

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

News April 20, 2026

హనుమకొండలో విద్యార్థినిపై దారుణం.. వీడియో వైరల్

image

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి, స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.

News April 20, 2026

రహానే చెత్త రికార్డు

image

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్‌(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.