News August 14, 2025

నంద్యాలలో వెలుగులోకి నకిలీ లెటర్ల మోసం?

image

నంద్యాల కేంద్రంగా టీటీడీ దర్శనం కోసం నకిలీ లెటర్లు తయారుచేసి రూ.వేలకు అమ్ముకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. బైర్మల్ వీధిలో అద్దెకు నివసించే ఓ యువకుడు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గుర్తించారు. తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ లెటర్ తయారు చేసి నెల్లూరు వాసులకు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 14, 2025

కృష్ణా: పెరిగిన వరద.. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదేశాలు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు.

News August 14, 2025

MBNR: ASIకి భారత ప్రభుత్వ ఇండియా పోలీస్ మెడల్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ మొయిజుద్దీన్(ASI)కు ఇండియా పోలీస్ మెడల్(IPM) భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి మొహమ్మద్ మొయిజుద్దీన్‌ని అభినందిస్తూ..“పోలీసు శాఖలో ఆయన చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయం అన్నారు. ఆయన కృషికి లభించిన గౌరవం అని ఎస్పీ కొనియాడారు.

News August 14, 2025

KNR: రూ.లక్షల్లో డబ్బు స్వాహా.. నిందితుడి అరెస్ట్

image

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్‌ను హన్మకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ట్రాన్సాక్షన్స్‌కి ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.