News August 14, 2025

నిర్మల్: నష్టం జరగకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో స్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం పెరిగిన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

Similar News

News April 18, 2026

వరల్డ్ హెరిటేజ్ డే: చారిత్రక వైభవం @ కౌలాస్ కోట

image

జుక్కల్‌ నియోజకవర్గంలోని కౌలాస్‌ కోట అపురూప శిల్పకళకు, చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. ఈ రాతి కోటలో అష్టభుజ ఎల్లమ్మ ఆలయం, వేంకటేశ్వరస్వామి గుడి, మసీదు, రాణిమహల్‌, ఫిరంగిలు ప్రధాన ఆకర్షణలు. బీదర్‌కు వెళ్లే సొరంగ మార్గం పర్యాటకులను అబ్బురపరుస్తోంది. మన పూర్వీకులు అందించిన ఈ అద్భుత కట్టడాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
#ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డే

News April 18, 2026

KNR: TASKలో టెక్నికల్ కోర్సుల శిక్షణ

image

కరీంనగర్‌లో TASK ఆఫీస్‌లో టెక్నికల్ కోర్సుల శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఇందులో ప్రధానంగా టెక్నికల్ కోర్సులు C, C++, డేటా స్ట్రక్చర్స్ , జావా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, జావా స్క్రిప్ట్, ఇట్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తామని అన్నారు. ఆసక్తిగల వారు KNR ఐటీ టవర్ 1st ఫ్లోర్‌లోని TASK ఆఫీస్‌లో ఏప్రిల్ 30లోపు సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

News April 18, 2026

ఒంగోలు: మూడు జిల్లాల దొంగ అరెస్ట్

image

ప్రకాశం, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మల్లి రెడ్డి నరేంద్రరెడ్డి(27)ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయ్ కృష్ణ, ఎస్ఐ హరిబాబు బృందం నిందితుడిని పట్టుకుని అతని నుంచి 110 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది. నరసరావుపేటలో తాకట్టు పెట్టిన బంగారం స్లిప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు.