News August 14, 2025
హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
Similar News
News August 14, 2025
‘మహావతార్ నరసింహ’కు భారీగా కలెక్షన్లు

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై 20 రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.236.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.15కోట్లు, భారత్‌లో రూ.221.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇవాళ రెండు పెద్ద సినిమాలు(వార్-2, కూలీ) విడుదలైనా బుక్ మై షోలో ఈ మూవీకి గంటకు 6.56k+ టికెట్లు బుక్ అవుతుండటం గమనార్హం.
News August 14, 2025
UPIలో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్

సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.
News August 14, 2025
Op సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు గ్యాలంట్రీ అవార్డులు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో 9 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లకు వీర్ చక్ర మెడల్స్, 26 మందికి వాయుసేన మెడల్స్, ఒకరికి శౌర్య చక్ర పతకాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ జరిపిన దాడుల్లో వీరు కీలక పాత్ర పోషించారు.