News August 14, 2025
HYD: అలాంటి లక్షణాలు కనిపిస్తే.. హాస్పిటల్ వెళ్లండి.!

మత్తుకు బానిసవుతున్న యువత ఆరోగ్యం క్షేనిస్తోంది. జ్ఞాపకశక్తి మందగించడం, కళ్లు ఎరుపెక్కటం, పెదాలు పొడి బారిపోవడం, ఒంటరిగా బతకటం, మానసిక ఒత్తిడిని గమనించటం, ఆకలి తగ్గిపోవడం, అంతకు ముందులా నిద్ర లేకపోవడం, నిద్రకు దూరం అవటం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Similar News
News August 14, 2025
ALERT: కాసేపట్లో వర్షం

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News August 14, 2025
మంచిర్యాల: ‘మధ్యాహ్న భోజనం అమలు చేయాలి’

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించాలని USFI విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఈరోజు ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తోన్న విధానంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని కోరారు.
News August 14, 2025
30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.