News August 14, 2025

బిహార్ ఓటరు లిస్టుపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

image

బిహార్‌‌లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను జిల్లాల వారీగా ప్రకటించాలని ECని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటర్ల తొలగింపునకు గల కారణాలను వెల్లడించాలని సూచించింది. జిల్లాలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను ఉంచాలని, దీనిపై వార్తా పత్రికలు, రేడియో, SMలో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. AUG 19లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను AUG 22కి వాయిదా వేసింది.

Similar News

News August 14, 2025

ALERT: కాసేపట్లో వర్షం

image

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News August 14, 2025

ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్

image

AP: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉ.10గంటలకు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఈ నెల 21న ఉ.10గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న ఉ.10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కోటా, 25న ఉ.10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

News August 14, 2025

DSC స్పోర్ట్స్ కోటా పోస్టుల పేరుతో మోసం.. జాగ్రత్త!

image

AP: స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 5,326 అప్లికేషన్స్ రాగా, 1200 మంది 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ క్రమంలో శాప్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారని జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. శాప్ నుంచి అలా ఎవరూ కాల్ చేసి డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. ఆశపడి డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.