News August 14, 2025

HYDలో 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి: కలెక్టర్

image

భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నట్లు HYD కలెక్టర్ హరిచందన తెలిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, హైదరాబాద్ జిల్లాలో 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఆఫీసుల్లో నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు వచ్చి ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడొద్దని సూచించారు.

Similar News

News August 14, 2025

వరంగల్: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

భారీ వర్షాల ప్రభావంతో పోతన రోడ్‌లోని మరాఠీ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డా.సత్య శారద సందర్శించారు. ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీ నిర్వాసితుల కోసం అందిస్తున్న తాగునీరు, ఆహారం, వైద్యసదుపాయాలు, వసతులను పరిశీలించారు. భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున పలు సూచనలు చేశారు.

News August 14, 2025

మంచిర్యాల: సెప్టెంబర్‌లో రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షలు

image

సెప్టెంబర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీఈఓ యాదయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పరిషత్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కొట్టే నటేశ్వర్, బీజేపీ నాయకుడు కిషోర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో విజేతలకు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

News August 14, 2025

మధ్యప్రదేశ్‌లో యాక్సిడెంట్.. బెల్లంపల్లిలో విషాదం

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వ్యాపారి మహేందర్ చౌదరి కుమారుడు అరవింద్ చౌదరి(10)విద్యార్థి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. స్వగ్రామమైన రాజస్థాన్‌కు కారులో వెళుతుండగా MPలో వెనుక నుంచి అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.