News August 14, 2025

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

image

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్‌ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News August 14, 2025

‘కూలీ’ సినిమా ఆల్ టైమ్ రికార్డు

image

ఓవర్సీస్ వసూళ్లలో ‘కూలీ’ <<17400697>>సినిమా<<>> ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు ($3,042,756= ₹24.26Cr) సాధించిన తమిళ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మీరు ఈ సినిమా చూశారా? ఎలా అనిపించింది?

News August 14, 2025

ఇంటర్‌తోపాటు నాలుగేళ్లు APలో చదివినవారే లోకల్: హైకోర్టు

image

AP: విద్యార్థుల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఇంటర్‌తోపాటు నాలుగేళ్లు చదివినవారే స్థానికులని తేల్చిచెప్పింది. లోకల్ అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా నిర్వచించారని పేర్కొంది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఉంటేనే లోకల్ అభ్యర్థులని, లేదంటే నాన్ లోకల్‌గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. స్థానికతపై పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.

News August 14, 2025

డెవాల్డ్ బ్రెవిస్‌కు ఊహించని ధర: అశ్విన్

image

CSK ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్‌కు గత సీజన్‌లో జాక్ పాట్ తగిలినట్లు ఆ జట్టు స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. 2025 సీజన్ కోసం బ్రెవిస్‌కు CSK భారీ పారితోషికం ఇచ్చినట్లు చెప్పారు. గత సీజన్‌లో బ్రెవిస్ బేస్ ప్రైజ్ రూ.75 లక్షలు కాగా సీఎస్కే అతడికి రూ.2.2 కోట్లు ముట్టజెప్పిందని వెల్లడించారు. ఇతర జట్లు కూడా అతడిని కొనేందుకు పోటీ పడడంతో ధర పెంచినట్లు పేర్కొన్నారు.