News August 14, 2025

2,3 రోజుల పాటు భారీ వ‌ర్షాలు: మంత్రి

image

భారీ వ‌ర్షాలు, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్లు, SPలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. ఈ VCలో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. మ‌రో 2,3 రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని, జిల్లా అధికారులు అప్ర‌మత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

Similar News

News August 14, 2025

తెర వెనుక పొత్తులకు బ్రాండ్ జగనే: షర్మిల

image

AP: మాజీ సీఎం జగన్‌ది నీతిమాలిన చరిత్ర అని పీసీసీ స్టేట్ చీఫ్ షర్మిల విమర్శించారు. తెర వెనుక పొత్తులకు ఆయన ఓ పెద్ద బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ‘మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చారు. మోదీ, అమిత్ షాతో హాట్ లైన్ టచ్‌లో ఉన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విమర్శలు చేస్తారా? మీదో పార్టీ.. మీరొక నాయకుడు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News August 14, 2025

ఆసిఫాబాద్: ‘రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి’

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ASFలోని మాలన్ గొందికి వెళ్లే రహదారి వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కొంతమేర తెగిపోవడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతు పనులు చేపట్టి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News August 14, 2025

సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగించుకోవాలి: ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్

image

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీమ్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కాగజ్‌నగర్ పట్టణంలోని సామాజిక సంక్షేమ భవనాలు, పాఠశాలలను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. వ్యక్తిగత శుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు.