News August 14, 2025

HYD: వరద ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్.!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా మొత్తం 149 వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, ఒక్కసారిగా వర్షం కురిసిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు తెలిపారు. అర్ధరాత్రి సమయంలోనూ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Similar News

News April 17, 2026

మన్యం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ..

image

పార్వతీపురం జిల్లాలోని 443 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 9,72,195 మంది ఓటర్లు నమోదవ్వగా వీరిలో 4,77,857 మంది పురుషులు, 4,94,338 మంది మహిళలున్నారు. పార్వతీపురం మండలంలో అత్యధికంగా 28,449 మంది ఓటర్లు ఉన్నారు. భామిని మండలంలో అత్యల్పంగా 10,429 మాత్రమే నమోదయ్యారు. త్వరలో పంచాయతీ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించనున్నారు.

News April 17, 2026

అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

image

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.

News April 17, 2026

గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

image

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.