News August 14, 2025

తిరుపతి స్విమ్స్‌లో MBBS అడ్మిషన్ల ప్రారంభం

image

తిరుపతి స్విమ్స్, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో MBBS అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలుకు చెందిన సాయిశ్రీ నిత్య నీట్-2025లో 14,255వ ర్యాంకు సాధించింది. ఆమెకు ఇక్కడ మొదటి అడ్మిషన్ ఇచ్చారు. ఆలిండియా కోటా ద్వారా ఈ కాలేజీకి 26 సీట్లు కేటాయించారు. ఓ అడ్మిషన్ పూర్తయ్యందని స్విమ్స్ ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ చెప్పారు.

Similar News

News August 14, 2025

‘కూలీ’ సినిమా ఆల్ టైమ్ రికార్డు

image

ఓవర్సీస్ వసూళ్లలో ‘కూలీ’ <<17400697>>సినిమా<<>> ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు ($3,042,756= ₹24.26Cr) సాధించిన తమిళ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మీరు ఈ సినిమా చూశారా? ఎలా అనిపించింది?

News August 14, 2025

ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్‌కి చెంపపెట్టు: దేవినేని ఉమా

image

ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవంకు ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాలే అతనికి శాపాలు అయ్యాయన్నారు. వై నాట్ కుప్పం అన్న జగన్ నేడు పులివెందుల ప్రజల తీర్పు పై ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు.

News August 14, 2025

GWL: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబు

image

గద్వాల కలెక్టర్ కార్యాలయం రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబు అయింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు. అటుగా వెళుతున్న వారు విద్యుత్ అలంకరణలో ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరుకానున్నారు. పుర ప్రముఖులు పాల్గొనాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు.