News August 14, 2025

రేపు ఏలూరులో స్వాతంత్ర్య వేడుకల్లో కార్యక్రమాలివే

image

ఏలూరు జిల్లా పోలీస్ మైదానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. మంత్రి పార్థసారథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని జిల్లా అధికారులు గురువారం తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పోలీసు కవాతు, 10 గంటలకు వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన,10:20 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10:50 గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం, 11:15 గంటలకు వివిధ శాఖల ప్రదర్శనలు ఉంటాయన్నారు.

Similar News

News April 18, 2026

నల్గొండ: సర్పంచ్ కుమారుడి ‘పెత్తనం’పై కంప్లైంట్

image

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.

News April 18, 2026

B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

image

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్‌ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

News April 18, 2026

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.