News August 14, 2025
UPIలో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్

సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.
Similar News
News August 15, 2025
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.
News August 14, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

☛ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
☛ ప్రమాదకర స్థితికి TG ద్రవ్యోల్బణం: హరీశ్ రావు
☛ MP పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తాం: రఘునందన్ రావు
☛ తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట.. ఈ నెల 18న తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
☛ ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
News August 14, 2025
ఈ నెల 19న భారత జట్టు ప్రకటన?

ఈ నెల 19న ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. జట్టు సెలక్షన్ అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఆ సమావేశంలోనే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రాబబుల్ జట్టు అంచనా: అభిషేక్, శాంసన్, సూర్య, తిలక్, హార్దిక్, గిల్, దూబే, అక్షర్, సుందర్, వరుణ్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్/ప్రసిద్ధ్, జితేశ్/జురేల్.