News August 14, 2025

సిద్దిపేట: అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

అధిక వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి అధిక వర్షాల వలన ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 29 నీటి వనరులు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు.

Similar News

News August 15, 2025

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.

News August 15, 2025

త్రివర్ణ శోభతో ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ త్రివర్ణ రంగుల విద్యుత్ కాంతులతో చూపరులను ఆకట్టుకుంటుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ భవనాన్ని ముస్తాబు చేశారు. రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ ఛైర్మన్ కోదండ రెడ్డి పాల్గొననున్నారు.

News August 15, 2025

KNR: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ సంచాలకులు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భూసేకరణ సమస్యలపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. KNR జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.