News April 1, 2024

పెద్దపల్లి: బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

image

సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 9, 2025

KNR: SRR విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

image

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) పరీక్ష ఫలితాల్లో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కామర్స్ విభాగంలో అక్కెం తిరుమలకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, జంగం నందిని 3వ ర్యాంకు సాధించారు. బాటనీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు పుట్టి అఖిల సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

News September 9, 2025

KNR: ఈనెల 11 నుంచి IFWJ జాతీయ సమావేశాలు

image

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈనెల 11- 13 తేదీల్లో ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాల్లో డిజిటల్ జర్నలిజం, జర్నలిస్టుల రక్షణ, పెన్షన్ స్కీం వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని KNR జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి కుడుతాడు బాపురావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమంతో సమావేశాలు ప్రారంభమవుతాయి

News September 9, 2025

KNR: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శం

image

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురా బొంబాయి స్కూల్ నుంచి రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ వేడుకల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు.