News August 14, 2025

KNR: రూ.లక్షల్లో డబ్బు స్వాహా.. నిందితుడి అరెస్ట్

image

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్‌ను హన్మకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ట్రాన్సాక్షన్స్‌కి ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News August 15, 2025

KNR: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ సంచాలకులు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భూసేకరణ సమస్యలపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. KNR జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

News August 14, 2025

KNR: సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్థలాల పరిశీలన

image

కరీంనగర్ సిటీలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రమేష్ బాబు గురువారం పరిశీలించారు. నగరంలో ఇప్పుడు ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లపై ఓవర్ లోడును తగ్గించేందుకు కొత్తగా మూడు సబ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో NPDCL డీఈ రాజం, ఈఈ శ్రీనివాస్, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.

News August 14, 2025

KNR: అతి భారీ వర్షాలపై విద్యుత్ వినియోగదారులకు సూచనలు

image

ఈ నెల 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఈ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా, 87124 88004 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. పునరుద్ధరణ బృందాలు 24 గంటల షిఫ్ట్ విధానంలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.