News August 14, 2025

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ చేసిన కలెక్టర్

image

బీబీపేట్ మండలం తుజాల్‌పూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మౌలిక వసతులను, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారిని ముందుగానే ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే ఔట్‌పేషెంట్ వివరాలను రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేయాలన్నారు.

Similar News

News April 18, 2026

WGL: ఎమ్మెల్యేలకు వీడిన టెన్షన్!

image

పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రస్తుత MLAలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు తోడుగా మరో 6-7 నియోజకవర్గాలు కొత్తగా వస్తాయని, ఇప్పుడున్న రిజర్వేషన్లు మారుతాయని ప్రచారం జరిగింది. కొందరు నాయకులు ఈ MLA మనకు ఉండరనే ఉద్దేశంతో మరో నేత దగ్గరకు వెళ్లిన వారున్నారు.కాగా ప్రస్తుత రిజర్వేషన్లే మళ్లీ ఉండటంతో తిరిగి MLAల దగ్గరకే రావాల్సిన పరిస్థితి లీడర్లకు ఏర్పడింది.

News April 18, 2026

‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

image

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

News April 18, 2026

సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

image

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.