News August 14, 2025
పీఐసీ ఛైర్మన్, సభ్యుల కాల పరిమితి 6 నెలలు పెంపు

సింగిల్ విండో పీఐసీ ఛైర్మన్లు సభ్యుల కాల పరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని రాజనగరం సింగిల్ విండో పీఐసీ ఛైర్మన్ రఘువర్ధన్ రెడ్డి తెలిపారు. గతంలో పెంచిన ఆరు నెలల గడువు ఈనెల ఆగస్టు 14వ తేదీతో ముగియటంతో మరో ఆరు నెలలు పొడిగించారన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం ఫిబ్రవరి 2026 వరకు పీఐసీ ఛైర్మన్లు, సభ్యులు పదవిలో కొనసాగుతారన్నారు.
Similar News
News April 20, 2026
ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం
News April 20, 2026
కామారెడ్డి: గాలి కోసం ఫ్యాన్ వేస్తే.. జేబుకు చిల్లు

భానుడి భగభగలకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విరామం లేకుండా తిరుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్ వాడకం పెరిగి మెజారిటీ ఇళ్లలో రీడింగ్ 200 యూనిట్ల దాటుతోంది. దీంతో ‘గృహ జ్యోతి’ ఉచిత విద్యుత్ పథకానికి జనం అనర్హులవుతున్నారు. వేసవిలో పెరిగిన యూనిట్లతో సామాన్యులపై వేలల్లో బిల్లుల భారం పడుతుండగా, ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గి పరోక్షంగా లాభం చేకూరుతోందనే చర్చ జోరందుకుంది.
News April 20, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


