News August 14, 2025
KMM: ఏడున్నర గంటల్లో 31.6 MM వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రఘునాథపాలెం 7.1, సత్తుపల్లి 6.1, సింగరేణి 5.0, KMM(R) 3.5, తిరుమలాయపాలెం 3.0, వేంసూరు 2.5, కల్లూరు 2.0, కొణిజర్ల 1.4, పెనుబల్లి 0.8, KMM(U) 0.2 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు.
Similar News
News August 14, 2025
మైనారిటీ గురుకుల సెక్రటరీని తొలగించాలి: ABVP

మైనారిటీ గురుకుల సెక్రటరీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతాంజలి, ప్రణీత్, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
News August 14, 2025
రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు ద్విచక్రవాహనదారుడు బుధవారం మృతిచెందారు. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ నరేశ్(28) కరుణగిరి వైపు వెళ్తుండగా మున్నేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆటోడ్రైవర్ నరేశ్‌తో పాటు బైక్ డ్రైవర్ రాంచరణ్ సాయి(22, ఖమ్మం బొక్కలగడ్డ) మృతిచెందారు.
News August 14, 2025
ఖమ్మం: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ కళాశాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ పూర్ణచందర్రావు ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఓపెన్ ఇంటర్, లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఈ నెల 20లోపు చెల్లించాలని ఆయన సూచించారు.