News August 14, 2025
HYD: సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ, పీఎస్వైడీ, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ తదితర కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
Similar News
News August 15, 2025
రాజేంద్రనగర్: 18న డ్యూయల్ డిగ్రీ కోర్స్‌ల కౌన్సెలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యుయల్ డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
News August 15, 2025
స్వదేశీ ఉద్యమంలో హైదరాబాద్‌కు గాంధీ

స్వాతంత్యోద్యమంలో స్వదేశీ ఉద్యమం ప్రధాన భూమిక పోషించింది. 1929 ఎప్రిల్ 7న సుల్తాన్‌బజార్‌లోని మహిళా సభకు గాంధీ మొదటిసారి వచ్చారు. విదేశీ వస్త్రాలు బహిష్కరించ తలపెట్టిన ఈ మహాకార్యంలో హిందుస్థాన్ అంతటికీ నూలు దుస్తులు HYD పంపీణీ చేయగలదని ప్రజలను ప్రోత్సహించారు. ‘వివేకవర్థినీ’లో జరిగిన ఈ ప్రోగ్రాంకు వామన్ నాయక్ అధ్యక్షత వహించారు. అనుకున్నట్లే HYD నూలు సరఫరా చేసి బ్రిటిషర్లకు నిద్రలేకుండా చేశారు.
News August 14, 2025
గోల్కొండ కోటలో అందుబాటులో స్పెషల్ మెడికల్ టీం

గోల్కొండ కోటలో పంద్రాగస్టు రోజున స్పెషల్ మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.శ్రీనివాసరావు తెలిపారు. ఎనిమిది మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన ఈ టీం శుక్రవారం ఉదయం నుంచి ఒంటి గంట వరకు గోల్కొండ కోటలోని క్యాంప్‌లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.