News August 14, 2025

NRPT: బాంబ్ స్క్వాడ్ పోలీసుల తనిఖీలు

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గురువారం నారాయణపేట పట్టణంలో బాంబ్ స్క్వాడ్ బృందం, జాగిలంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్, కూడళ్లు, జిల్లా కోర్టు సముదాయం, ఆర్టీసీ బస్టాండ్, వీఐపీ గెస్ట్ హౌస్, పరేడ్ మైదానం, జన సమూహం గల ప్రదేశాలలో తనిఖీలు చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు.

Similar News

News April 16, 2026

నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

image

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.

News April 16, 2026

భద్రాచలం: ఫలితాల్లో ఏకలవ్య విద్యార్థుల ప్రభంజనం

image

పదో తరగతి సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్ పాఠశాలలు (EMRS) 99.78 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించాయి. మొత్తం 455 మంది విద్యార్థులకు గాను 454 మంది పాసయ్యారని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. 8 పాఠశాలల్లో 7 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, బాలికలందరూ ఉత్తీర్ణత పొందడం విశేషం. ప్రతిభ చాటిన 18 మంది విద్యార్థులను పీవో ప్రత్యేకంగా అభినందించారు.

News April 16, 2026

యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్‌లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్‌ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.