News August 14, 2025
శ్రీకాకుళం: నాలుగు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో 14-17 వరకు జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగవచ్చని EPDCL ఎస్‌ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విస్తారమైన వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేసిందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, స్తంభాలు పడిపోయిన, వైర్లు తెగిన సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.
Similar News
News September 10, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ఊరట

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హైదరాబాద్(HYB)- భువనేశ్వర్(BBS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB- BBS రైలును ఈ నెల 16 నుంచి NOV 25 వరకు ప్రతి మంగళవారం, నం.07166 BBS- HYB మధ్య నడిచే రైలును నేటి (బుధవారం) నుంచి NOV 26 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News September 10, 2025
SKLM: అప్పారావు నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని గుడి వీధికి చెందిన ఆంధవరపు అప్పారావు (93) బుధవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి.సుజాత, ఉమశంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News September 10, 2025
ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్

ఆమదాలవలసలోని చిట్టివలసకు చెందిన నవిరి పూర్ణ (22) వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు.