News August 14, 2025
మంచిర్యాల: పంచాయతీ అధికారులతో డీపీఓ సమీక్ష

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావ్ డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో ఈరోజు సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. క్షేత్ర స్థాయి అధికారుల తనిఖీలు, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, పౌర సేవలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను సమీక్షించాలన్నారు.
Similar News
News August 15, 2025
ఇండియాపై టారిఫ్స్ వల్లే పుతిన్ కలుస్తున్నారు: ట్రంప్

రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను కలవడం వెనుక భారత్‌పై వేసిన అదనపు టారిఫ్స్ కూడా ఓ కారణమని US అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ‘ప్రతి నిర్ణయానికి ఓ ప్రభావం ఉంటుంది. ఇండియాపై రెండోసారి విధించిన సుంకాలు వారిని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆపేశాయి. మీ రెండో అతిపెద్ద కస్టమర్‌ని కోల్పోయినప్పుడు, మొదటి అతిపెద్ద కస్టమర్‌ని కోల్పోబోతున్నప్పుడు బహుశా ఆ ప్రభావం ఉందని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
News August 15, 2025
మెదక్: వాలీబాల్ బాలబాలికల జట్ల ఎంపిక

అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా జట్టు ఎంపిక చేశారు. క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా(SGF) కార్యదర్శి ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించగా 110 మంది బాలికలు, 150 మంది బాలురు పాల్గొన్నారు. ఇందులో 8 మంది బాలురు, 8 మంది బాలికలతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. క్లబ్ బాధ్యులు మధుసూదన్ రావు, డా. కొక్కొండ ప్రభు, పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్ ఉన్నారు.
News August 15, 2025
గోదావరిఖని: సింగరేణి RG1లో ఉత్తమ ఉద్యోగులు వీరే…

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా SCCL RG1 ఉత్తమ ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. ఇందులో GDK1, 3 గనికి చెందిన S.ఎల్లయ్య, P.శ్రీకాంత్, GDK 2, 2A గనికి చెందిన A.సుధాకర్, రవి, OCP 5కి చెందిన N.శ్రీనివాస్, MD.షబ్బీర్ అహ్మద్, GDK 11గనికి చెందిన M.రామస్వామి, SDL/LHD ఆపరేటర్ J.శ్రీనివాస్, CSP 1కి చెందిన B.సమ్మయ్య, OCP5 గనికి చెందిన R.లక్ష్మినారాయణ ఉన్నారు. నేడు వీరిని ఘనంగా సన్మానించనున్నారు.