News August 14, 2025

కర్ణాటక PH.Dలో ప్రవేశం పొందిన ఆదిలాబాద్ విద్యార్థిని

image

ADB పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల పూర్వ విద్యార్థిని తన ప్రతిభను కనబరుస్తూ వస్తుంది. గుడిహత్నూర్ గ్రామం కొల్హారి గ్రామానికి చెందిన ముండే రూమతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ చదువుతూనే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ చరిత్ర సబ్జెక్ట్‌లో అర్హత సాధించింది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అర్హత సాధించి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో PHDలో చేరింది.

Similar News

News August 14, 2025

ఆదిలాబాద్‌కు చేరుకున్న ప్రభుత్వ సలహాదారుడు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడు మమ్మద్ షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొననున్న షబ్బీర్ అలీ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

News August 14, 2025

ఆదిలాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పరేడ్ మైదానం ముస్తాబు

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో గల పరేడ్ మైదానం ముస్తాబైంది. వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉ.9:30 గంటలకు జిల్లా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం, సంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ సందర్శన ఉంటుందని అధికారులు తెలిపారు.

News August 14, 2025

ఆదిలాబాద్: ఉద్యాన వన విస్తరణ అధికారుల బాధ్యతల స్వీకరణ

image

ఆదిలాబాద్ జిల్లా ఉద్యాన వన, పట్టు పరిశ్రమ శాఖలో నూతనంగా ఉద్యాన వన విస్తరణ అధికారులు నియమితులయ్యారు. జైనథ్ మండలానికి గణేశ్, బోథ్ మండలానికి భూమయ్య, తాంసి మండలానికి శైలజ, గుడిహత్నూర్ మండలానికి సతీశ్ ఉద్యాన వన విస్తరణాధికారులుగా పట్టు పరిశ్రమ ఉన్నతాధికారి నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం బాధ్యతలు చేపట్టారు.