News August 14, 2025
రెబ్బెన: ‘అక్రమంగా ఇసుక రవాణా’

రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని హిందూ వాహిని యూత్ సభ్యులు తెలిపారు. ఈ నదిలో భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తుంటారని, ఇసుక ఉండటంతో పర్యాటకంగా బాగుంటుందన్నారు. అక్రమంగా ఇసుకను తరలించడంతో నది బోసిపోయి అసౌకర్యంగా మారుతుందన్నారు. అధికారులు స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
Similar News
News August 15, 2025
టీమిండియా రైజింగ్ స్టార్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియన్ క్రికెట్‌లో రైజింగ్ స్టార్ ఎవరో చెప్పారు. ‘నేను శుభ్‌మన్ గిల్‌ని టీమిండియా రైజింగ్ స్టార్‌గా భావిస్తున్నాను. కేవలం 25 ఏళ్లలోనే అతను ఎంతో గుర్తింపు సాధించారు. ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇంగ్లండ్‌లో అతను ఎలాంటి సిరీస్‌ని ఎదుర్కొన్నారో అంతా చూశాం. అతను చాలా కామ్ అండ్ కంపోజ్డ్. సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడగల సత్తా అతనికి ఉంది’ అని పేర్కొన్నారు.
News August 15, 2025
ములుగు: స్వతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఇవే..

జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు. ఉదయం 8:45 గంటలకు వేడుకల ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, 9:30 గంటలకు అతిథుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 10 గంటలకు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, 10:30 గంటలకు ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల పంపిణీ ఉంటాయని వెల్లడించారు.
News August 15, 2025
గురుకులాల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్: ITDA PO

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ చేపడుతున్నట్టు చెప్పారు. ఈనెల 19న బాలికలకు, 20న బాలురకు భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.