News August 14, 2025

ఆసిఫాబాద్: ‘రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి’

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ASFలోని మాలన్ గొందికి వెళ్లే రహదారి వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కొంతమేర తెగిపోవడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతు పనులు చేపట్టి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Similar News

News April 18, 2026

GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

image

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.

News April 18, 2026

1 Min లేటైనా CETకు అనుమతి లేదు

image

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.

News April 18, 2026

సంతమాగులూరులో కుళ్లిన మృతకళేబరం కలకలం

image

సంతమాగులూరు మండలంలోని కొప్పరం నుంచి సజ్జాపురం వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో కుళ్లిన కళేబరం శుక్రవారం కలకలం రేపింది. ఎముకుల గూడుతో ఉన్న డెడ్‌బాడీని పశువుల కాపరి చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. దీనిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.