News August 14, 2025

KMR: జిల్లాలో తగ్గుతున్న ప్రమాదాలు.. డీజీపీ ప్రశంసలు!

image

రోడ్డు ప్రమాదాల నివారణలో కామారెడ్డి జిల్లా పోలీసులు సాధించిన పురోగతిని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ అభినందించారు. జిల్లాలో గతేడాది మొదటి ఏడు నెలలతో పోలిస్తే, ఈ ఏడాది ఇదే కాలంలో జిల్లాలో 41 రోడ్డు ప్రమాదాలు, 44 మరణాలు తగ్గాయని జిల్లా SP రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. ఈ కృషికి డీజీపీ ప్రశంసలు అందించారని, తమ అంకితభావం ఆదర్శనీయమని పేర్కొన్నారని SP తెలిపారు.

Similar News

News April 20, 2026

నేడు భూపాలపల్లి జిల్లాకు సీఎం రేవంత్

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గం.కు హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకొని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 3:45కు మేడిగడ్డకు చేరుకొని 4:30 వరకు బ్యారేజీని పరిశీలిస్తారు. 4:35 నుంచి 5:35 వరకు రివ్యూ మీటింగ్ అనంతరం 6:30కు నస్తూర్‌పల్లికి చేరుకుని, అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. 7:45కు తిరుగు ప్రయాణం కానున్నారు.

News April 20, 2026

ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

image

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News April 20, 2026

చిత్తూరు: బాబోయ్ ఎండలు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీల పరిస్థితి వర్ణనాతీతం. ఆదివారం అత్యధికంగా తవణంపల్లెలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీరంగరాజపురంలో 41.4, గంగవరంలో 41.4, రొంపిచెర్లలో 41.0, పెద్దపంజాణి, బంగారుపాళ్యంలో 40.8, నిండ్రలో 40.6, నగరిలో 40.4, శాంతిపురంలో 39.9, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాల, పూతలపట్టులో 39.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.