News August 14, 2025
గంగమ్మ వాగును సందర్శించిన జిల్లా ఎస్పీ

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగమ్మ వాగును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం సందర్శించారు. వాగులో నీటిమట్టాన్ని ఆయన పరిశీలించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు తక్షణ సహాయం కోసం డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 08468-220069కు డయల్ చేయవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్ఐ లావణ్య ఉన్నారు.
Similar News
News April 17, 2026
NRPT: నిబంధనల ప్రకారమే లే-అవుట్లకు అనుమతులు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలకు లోబడే లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా లే-అవుట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందిన నాలుగు దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న రెండింటికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
తిరుపతి: ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు ఊరట

స్విమ్స్ శ్రీపద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2020-21 ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు 5 ఏళ్లకు బదులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. కోర్సు వ్యవధి మేరకే ఫీజులు ఉండాలన్న విద్యార్థుల విజ్ఞప్తిపై టీటీడీ ఈవో రవిచంద్ర స్పందించి, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదం పొందనుంది. ఈ విధానం ఇకపై తదుపరి బ్యాచ్‌లకు కూడా వర్తించనుంది.
News April 17, 2026
LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.


