News August 14, 2025

ఏలూరు: విద్యుత్ దీపాలతో కలెక్టరేట్

image

ఏలూరు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని అవగాహన కల్పిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్‌ను త్రివర్ణ రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.

Similar News

News August 15, 2025

వియత్నాం స్టీల్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ

image

వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని స్టీల్ షిప్మెంట్స్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల భారత ఉక్కు రంగానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలోయ్/నాన్-అలోయ్ స్టీల్‌తో చేసిన ఉత్పత్తులపై ఈ సుంకం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా టారిఫ్స్ విధించకపోతే దేశీయ ఉక్కు రంగానికి ప్రమాదమని పేర్కొంది.

News August 15, 2025

GDK: ఈనెల 17న అరుణాచలంకు ప్రత్యేక బస్సు

image

ఈనెల 17న మ.3 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరిఖని RTC డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, విష్ణు కంచి, శివ కంచి, అలంపూర్ జోగులాంబ క్షేత్రాలను దర్శించుకుని తిరిగి 21న బస్సు GDK చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5,600లు, పిల్లలకు రూ.4,400లు.

News August 15, 2025

రాజేంద్రనగర్‌: 18న డ్యూయల్‌ డిగ్రీ కోర్స్‌ల కౌన్సెలింగ్‌

image

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యుయల్‌ డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 18న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.