News August 14, 2025

సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వినతి

image

రాష్ట్రంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ల నేపథ్యంలో సైకాలజిస్టులకు కౌన్సిలర్ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జనగామ జిల్లా నాయకులు కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల మురళి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సైకాలజిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ అవసరమని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2026

అసైన్డ్ భూముల సమస్యకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి అసైన్డ్ భూముల అంశంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ అంకిత్ నిర్వహించారు. భద్రాద్రి జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించిన వివిధ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అసైన్డ్ భూములపై అక్రమ ఆక్రమణలను కఠినంగా అరికట్టాలని, ఎక్కడైనా అక్రమాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 17, 2026

మహానందిలో యాక్సిడెంట్..ఒకరు మృతి

image

మహానంది సిరివెళ్ల మండల సరిహద్దులోని నంద్యాల గిద్దలూరు రహదారిలో గురువారం యాక్సిడెంట్ జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News April 17, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
వ్యవసాయం రైతులకు జీవనాడి: జడ్పీ సీఈఓ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి చేరుకున్న నరసన్నపేట పంచాయతీ రగడ
జనగణన ప్రక్రియను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
పాలీసెట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు