News August 14, 2025

రేపటి వేడుకలకు గద్వాల ఎస్పీ కార్యాలయం సిద్ధం

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయం రేపటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. గురువారం రాత్రి కార్యాలయ సిబ్బంది కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శుక్రవారం ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News April 18, 2026

కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేస్తుంది: ట్రంప్

image

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాము స్తంభింపజేసిన నిధులను ఆ దేశానికి ఇవ్వబోమని స్పష్టంచేశారు. ‘యురేనియం శుద్ధిని ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. రెండు దేశాల మధ్య చాలా కీలక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వారాంతంలోనే శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి’ అని ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు.