News August 14, 2025
విద్యుత్ కాంతులతో మెరిసిన కలెక్టరేట్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైంది. గురువారం మధ్యాహ్నం నుంచి అధికారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పురాతనమైన కలెక్టరేట్ భవనం విద్యుత్ కాంతుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖద్వారం సైతం చూడముచ్చటగా అలంకరించారు. కలెక్టరేట్‌తో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Similar News
News August 15, 2025
విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.

విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.