News August 14, 2025
స్వాతంత్ర్య దినోత్సవానికి కోనసీమ కలెక్టరేట్ ముస్తాబు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం కలెక్టరేట్ ముస్తాబైంది. అధికారులు, సిబ్బంది కలెక్టరేట్ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, జాతీయ జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు బాలయోగి స్టేడియంలో జరగనున్న వేడుకలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Similar News
News April 19, 2026
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News April 19, 2026
భీమేశ్వర సన్నిధిలో సినీ హీరోయిన్ అనన్య

వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు ప్రసాదం అందజేశారు.
News April 19, 2026
RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.


