News August 14, 2025

SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్

image

TG: బిహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు <<17403517>>తీర్పు<<>> ప్రజాస్వామ్య విజయమని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. LoP రాహుల్ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణ ఈ తీర్పుతో రుజువైందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధార్ లింక్‌తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానం అమలు చేయాలన్న రాహుల్ డిమాండ్‌పై EC స్పందించాలని డిమాండ్ చేశారు.

Similar News

News August 15, 2025

వియత్నాం స్టీల్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ

image

వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని స్టీల్ షిప్మెంట్స్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల భారత ఉక్కు రంగానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలోయ్/నాన్-అలోయ్ స్టీల్‌తో చేసిన ఉత్పత్తులపై ఈ సుంకం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా టారిఫ్స్ విధించకపోతే దేశీయ ఉక్కు రంగానికి ప్రమాదమని పేర్కొంది.

News August 15, 2025

టీమిండియా రైజింగ్ స్టార్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

image

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియన్ క్రికెట్‌లో రైజింగ్ స్టార్ ఎవరో చెప్పారు. ‘నేను శుభ్‌మన్ గిల్‌ని టీమిండియా రైజింగ్ స్టార్‌గా భావిస్తున్నాను. కేవలం 25 ఏళ్లలోనే అతను ఎంతో గుర్తింపు సాధించారు. ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇంగ్లండ్‌లో అతను ఎలాంటి సిరీస్‌ని ఎదుర్కొన్నారో అంతా చూశాం. అతను చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌. సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడగల సత్తా అతనికి ఉంది’ అని పేర్కొన్నారు.

News August 15, 2025

ఆగస్టు 15: చరిత్రలో ఈ రోజు

image

1769: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం
1872: యోగి, జాతీయవాది శ్రీ అరబిందో(ఫొటోలో) జననం
1945: నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావు జననం
1947: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
1975: భారత మాజీ క్రికెటర్ విజయ్ భరద్వాజ్ జననం
2018: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం