News August 14, 2025

DSC అభ్యర్థులకు అలర్ట్

image

AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు డీఎస్సీ <>వెబ్‌సైట్‌లో<<>> సరిచేసుకోవాలని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం రేపటి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 19, 2026

SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు: మంత్రి

image

AP: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 40% రాయితీతో పంపిణీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మవచ్చని వివరించారు.

News April 19, 2026

ప్రభ్‌సిమ్రన్.. మ్యాచును మలుపు తిప్పేస్తాడు!

image

పంజాబ్ విజయాల్లో శ్రేయస్‌తో పాటు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ పాత్ర ఎంతో ఉంది. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపు తిప్పేయడం ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 56 IPL మ్యాచుల్లో 1,516 రన్స్ చేశారు. 2023లో ఢిల్లీపై సెంచరీ చేశారు. స్ట్రైక్ రేట్ 154గా ఉంది. 2026 సీజన్లో 5 మ్యాచుల్లోనే 70 సగటుతో 211 రన్స్ చేశారు. తాను యువీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని ఇటీవల చెప్పారు.

News April 19, 2026

‘కొంగ జపం’ చేసేవారితో జాగ్రత్త!

image

భగవంతుడి నామాన్ని నిత్యం పలకడాన్ని ‘జపం’ అంటారు. మంచివారిగా నటిస్తూ మోసం చేసేవారి గురించి చెప్పే సందర్భంలో ‘కొంగ జపం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఇది పంచతంత్రంలోని కొంగ-ఎండ్రకాయ కథ నుంచి వచ్చింది. ఎండిపోతున్న చెరువులో ఓ కొంగ ఉండేది. వేటాడటం కష్టమవడంతో కళ్లు మూసుకొని జపం చేస్తున్నట్లు నటించేది. చేపలను మరో చెరువులోకి తీసుకెళ్తానని చెప్పి తినేది. చివరికి ఎండ్రకాయ దానిని చంపేస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>