News April 1, 2024

పొంగులేటికి ఖమ్మం, తుమ్మలకు మహబూబాబాద్

image

పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోకసభ స్థానాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించింది. ఖమ్మం పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 30, 2024

ఖమ్మం: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
ఖమ్మం 2938 321 1: 09
భద్రాద్రి 2414 260 1:10

News September 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News September 30, 2024

ఖమ్మం: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు

image

KMM- NLG- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.