News August 14, 2025

KNR: సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్థలాల పరిశీలన

image

కరీంనగర్ సిటీలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రమేష్ బాబు గురువారం పరిశీలించారు. నగరంలో ఇప్పుడు ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లపై ఓవర్ లోడును తగ్గించేందుకు కొత్తగా మూడు సబ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో NPDCL డీఈ రాజం, ఈఈ శ్రీనివాస్, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

KNR: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HYD దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ సంస్థలో 3 సంవత్సరాల 2026-27 డిప్లమో కోర్సులకు అనాధ బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి తెలిపారు. దీనికి పాలిటెక్ని ప్రవేశపరిక్ష రాయకున్నా టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎంపికైన వారికి ఉచిత విద్య వసతి కల్పిస్తారు. మే 23లోగా KNR బాల రక్షభవన్లో దరఖాస్తు చేయాలి. వివరాలకు 9490881098 సంప్రదించవచ్చు.

News April 18, 2026

KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

image

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.