News August 15, 2025

VJA: బుడమేరు ప్రణాళిక ఇదే.. కానీ ఆ ఒక్కటే లేదు!

image

బుడమేరు సమస్య పరిష్కారం కోసం అధికారులు 4 DPRలు రెడీచేశారు. కాలువలో పూడికతీతతో పాటు ప్రత్యామ్నాయంగా రెగ్యులేటర్ నుంచి 25KM వరకు ఓ కాలువను విజయవాడ శివారు మీదుగా తవ్వి ఎనికెపాడు వద్ద బుడమేరులో కలపడం, ఏలూరు పరిధి నుంచి కొల్లేరు వరకు కాలువ వెడల్పు, కొల్లేరు నుంచి ఉప్పుటేరు వరకు కాలువ వెడల్పు పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.4864 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా కాగా.. నిధులు లేక ప్రభుత్వం పనులు చేపట్టలేదు.

Similar News

News April 15, 2026

గుర్తుపెట్టుకోండి.. ‘అతి వినయం ధూర్త లక్షణం’

image

సహజ విరుద్ధంగా ఎవరి పట్లయినా అధిక వినయం, గౌరవాన్ని ప్రదర్శించేవారిని ప్రస్తావించేటప్పుడు ఈ సూక్తిని వాడతాం. పంచతంత్ర కథలు, చాణక్య నీతి కథల నుంచి ఇది వచ్చింది. వినయంగా ఉండటం మంచిదే. కానీ దాన్ని అతిగా ప్రదర్శిస్తున్నారంటే నమ్మక ద్రోహానికి సంకేతం కావొచ్చు. తమ పనులు సాధించుకోవడానికి మోసగాళ్లు, స్వార్థపరులు ఇలా చేస్తారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురయ్యారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 15, 2026

అబార్షన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో అబార్షన్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసు వెనుక ఉన్న కారణాలు, చోటుచేసుకునే ప్రాంతాలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాలపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీడీ డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు.

News April 15, 2026

పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.