News August 15, 2025

శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.

Similar News

News August 15, 2025

EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

image

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>

News August 15, 2025

అమెరికా బెదిరింపులు.. వెనక్కి తగ్గని భారత్

image

USటారిఫ్స్ నేపథ్యంలో రష్యన్ ఆయిల్ తక్కువ/ఎక్కువ కొనాలని ఎవరూ చెప్పలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) పేర్కొంది. ‘యథావిధిగా వ్యాపారం చేస్తున్నాం. ఆయిల్ దిగుమతులపై నిలుపదల లేదు. రష్యా ముడి చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అమెరికా/ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎక్కువ కొనండి లేదా తగ్గించండి అని కూడా ఎవరూ చెప్పలేదు’ అని IOC ఛైర్మన్ AS సాహ్ని వెల్లడించారు. రష్యా ఆయిల్‌పై భారత్ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

News August 15, 2025

కుక్కలకు మెరుగైన జీవితం ఇవ్వండి: కపిల్ దేవ్

image

వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలన్న SC తీర్పుపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ‘కుక్కల గురించి చాలా వార్తలు వింటున్నాం. అవి చాలా అద్భుతమైన జీవులు. వాటికి అధికారులు మెరుగైన జీవితాన్ని అందించాలి. ఊరికే అలా వాటిని ఎక్కడో పడేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. వీధికుక్కలపై జరుగుతున్న చర్చలు, వివాదాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.