News August 15, 2025

మంత్రి పొంగులేటితో ఇన్‌ఛార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

భారీ వర్షాలు సహాయక చర్యల నిర్వహణపై మంత్రి పొంగులేటి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ (రెవెన్యూ) తో పాటు టొప్పో పాల్గొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి టొప్పో వివరించారు.

Similar News

News August 15, 2025

మెదక్: ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండ్

image

మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావు నగర్ కాలనీలో బుధవారం పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో బాగంగా పట్టుబడ్డ కానిస్టేబుల్స్ అంజనేయులు, సురేశ్‌పై శాఖపరమైన చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 15, 2025

‘గుంటూరు కేసరి’ నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు

image

స్వాతంత్రోద్యమ కాలంలో ‘గుంటూరు కేసరి’గా నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు (1890-1978) పిలవబడ్డారు. టంగుటూరి ప్రకాశం వద్ద శిష్యుడిగా పనిచేసి, కోస్తాంధ్ర ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వ్యక్తి. స్వాతంత్రానికి ముందు 11 సంవత్సరాలు గుంటూరు పురపాలక ఛైర్మన్‌గా, 1953లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా చేశారు. గాంధీ పార్క్ నిర్మాణం ఈయన హయాంలోనే జరిగింది. హిమని కూడలి వద్ద ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

News August 15, 2025

కుక్కలకు మెరుగైన జీవితం ఇవ్వండి: కపిల్ దేవ్

image

వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలన్న SC తీర్పుపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ‘కుక్కల గురించి చాలా వార్తలు వింటున్నాం. అవి చాలా అద్భుతమైన జీవులు. వాటికి అధికారులు మెరుగైన జీవితాన్ని అందించాలి. ఊరికే అలా వాటిని ఎక్కడో పడేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. వీధికుక్కలపై జరుగుతున్న చర్చలు, వివాదాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.