News August 15, 2025
TODAY HEADLINES

* పులివెందుల, ఒంటిమిట్ట ZPTCలు TDP కైవసం
* ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN
* దొంగ ఓట్లతో గెలవడమూ ఓ గెలుపేనా: అవినాశ్
* CS పదవీకాలం పొడిగింపు కోసం CM రేవంత్ రిక్వెస్ట్!
* SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్
* 3 దశాబ్దాల తర్వాత నచ్చిన వారికి ఓటేశారు: పవన్
* ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది: రాష్ట్రపతి
* ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్
Similar News
News April 18, 2026
1 Min లేటైనా CETకు అనుమతి లేదు

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.
News April 18, 2026
మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!
News April 18, 2026
మహిళలకు విపక్షాల ద్రోహం: CM

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.


