News August 15, 2025
భద్రాద్రి జిల్లా జీపీ కార్యదర్శికి ఎర్రకోట ఆహ్వానం

ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చుంచుపల్లి మండలం గౌతమ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కంపూడి షర్మిలకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. 2023లో ‘హెల్తీ పంచాయతీ’ థీమ్‌లో గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు లభించినందుకు గాను ఈ ఆహ్వానం దక్కిందని ఆమె తెలిపారు. ఆహ్వానం రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనతకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
Similar News
News April 16, 2026
గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.
News April 16, 2026
మహిళలకు LSలో 272 సీట్లు: కేంద్ర మంత్రి

ఉమెన్ రిజర్వేషన్ల అమలు ద్వారా లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వు అవుతాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రకటించారు. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లులను ఆయన LSలో ప్రవేశపెట్టారు. ‘LS స్థానాలు 543 నుంచి గరిష్ఠంగా 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల నుంచి 815, UTల నుంచి 35 ఉంటాయి. రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెరుగుతాయి. స్త్రీలకు 272 దక్కుతాయి. ఇవి 33%కి సమానం’ అని తెలిపారు.
News April 16, 2026
సూర్యాపేట: ఆచరించి.. ఆదర్శంగా నిలిచారు

రోడ్డు భద్రత కేవలం నినాదాలకే పరిమితం కాదని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఆచరించి చూపారు. గురువారం నిర్వహించిన ‘ఆరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తిరుగు ప్రయాణంలో తమ కారు ఎక్కగానే స్వయంగా సీట్ బెల్ట్ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రమాద సమయాల్లో సీట్ బెల్ట్ ప్రాణరక్షక కవచంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.


