News August 15, 2025

పులివెందుల‌లో ప్ర‌జాస్వామ్యం గెలిచింది: ఎంపీ కేశినేని

image

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు పులివెందులలో నిజమైన స్వేచ్ఛను పొందిందని వ్యాఖ్యానించారు. గత 30 ఏళ్లుగా అక్కడ ఎన్నికలు జరగకపోవడం, ఎవరి రౌడీయిజం కారణమో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.

Similar News

News April 16, 2026

పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: ఎస్పీ

image

అనంతపురంలోని జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో SP జగదీష్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష జరిగింది. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, మట్కా, బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నైట్ సేఫ్టీ, మైనర్ డ్రైవింగ్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.

News April 16, 2026

పాలమూరు: ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

image

అయిజ మండలం తూముకుంటలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున్(37) వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తల్లి రంగమ్మ (75) ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. తల్లి కొడుకు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అతడికి భార్య, కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 16, 2026

ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 5-7, 15-17 ఏళ్ల విద్యార్థుల ఆధార్ నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. 17,501 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సచివాలయాల్లో శిబిరాలు నిర్వహించి, 24 గంటల్లో సవరణలు చేయాలని అధికారులకు సూచించారు.