News August 15, 2025
పార్వతీపురం: భారీ వర్షాల హెచ్చరిక..అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి సమావేశం నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల తరుణంలో రానున్న 5 రోజులు అప్రమత్తంగా ఉంటు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News April 19, 2026
హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

ఉప్పల్ స్టేడియంలో తండ్రీకొడుకుల డ్యూటీ

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు శాఖలో ఉండటంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అధికారులు ఒకే కార్యక్రమంలో విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.