News August 15, 2025
జిల్లాలోని క్రీడాకారులకు గుడ్ న్యూస్

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పురస్కారాలను అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని 5 పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. 2025 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు 18లోగా ధ్రువీకరణ పత్రాలను ఎస్సీఎఫ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Similar News
News April 18, 2026
ఒంగోలు: మూడు జిల్లాల దొంగ అరెస్ట్

ప్రకాశం, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మల్లి రెడ్డి నరేంద్రరెడ్డి(27)ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయ్ కృష్ణ, ఎస్ఐ హరిబాబు బృందం నిందితుడిని పట్టుకుని అతని నుంచి 110 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది. నరసరావుపేటలో తాకట్టు పెట్టిన బంగారం స్లిప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
News April 18, 2026
ప్రకాశం: రైతుల కోసం బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
News April 18, 2026
ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు