News August 15, 2025
మట్టి వినాయకులను పూజిద్దాం: జేసీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జేసీ అభిషేక్ కుమార్ గురువారం వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మట్టి విగ్రహాలనే వినియోగించాలని ప్రజలకు సూచించారు. శాంతి భద్రతల కోసం బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విగ్రహాల ఎత్తు పరిమితికి మించకూడదని స్పష్టం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను పూజించి నిమజ్జనం చేయడంతో నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.
Similar News
News April 18, 2026
SRPT: రోడ్డు ప్రమాదంలో VRO మృతి

తిరుమలగిరి VRO ముస్తఫా శుక్రవారం రాత్రి దూరాజ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచి కోదాడకు తిరిగి వస్తుండగా, జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ముస్తఫా మృతితో తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
News April 18, 2026
NMC చేసిన మార్పుల వల్లే పరీక్ష వాయిదా!

MBBS పరీక్షల సిలబస్‌లో NMC నిబంధనల ప్రకారం (పాతనిబంధనలు) పేపర్-Iలోని జనరల్ సర్జరీ కింద చేర్చిన కొన్ని అధ్యాయాలు ఇప్పుడు కొత్త నిబంధనల్లో జనరల్ సర్జరీ పేపర్-IIలో చేర్చడం వల్లే ఈనెల 15న జరిగిన <<19670707>>MBBS జనరల్ సర్జరీ పేపర్-1 (రెగ్యులర్) పరీక్ష రద్దు చేసి<<>>, ఈనెల 27కు వాయిదా వేసినట్లు KNRUHS ప్రకటించింది. విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
News April 18, 2026
ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


