News August 15, 2025

గోదావరిఖని: సింగరేణి RG1లో ఉత్తమ ఉద్యోగులు వీరే…

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా SCCL RG1 ఉత్తమ ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. ఇందులో GDK1, 3 గనికి చెందిన S.ఎల్లయ్య, P.శ్రీకాంత్‌, GDK 2, 2A గనికి చెందిన A.సుధాకర్‌, రవి, OCP 5కి చెందిన N.శ్రీనివాస్‌, MD.షబ్బీర్‌ అహ్మద్‌, GDK 11గనికి చెందిన M.రామస్వామి, SDL/LHD ఆపరేటర్‌ J.శ్రీనివాస్‌, CSP 1కి చెందిన B.సమ్మయ్య, OCP5 గనికి చెందిన R.లక్ష్మినారాయణ ఉన్నారు. నేడు వీరిని ఘనంగా సన్మానించనున్నారు.

Similar News

News August 15, 2025

ఇవాళ టీవీలో వచ్చే దేశభక్తి సినిమాలు ఇవే

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీ ఛానల్స్‌లో ఎన్నో మంచి దేశభక్తి చిత్రాలు ప్రసారం కానున్నాయి. *జెమినీ టీవీ: మ.2.30 గం.కు మేజర్ చంద్రకాంత్ *జెమిని లైఫ్: ఉ.11గం.కు అల్లూరి సీతారామరాజు *జెమిని మూవీస్: మ.1 గం.కు ఖడ్గం, సా.4 గం.కు మహాత్మ, రా.10 గం.కు మేజర్ *జీ తెలుగు: సా.4 గం.కు సుభాష్ చంద్రబోస్ *జీ సినిమాలు: ఉ.9 గం.కు ఉరీ ది సర్జికల్ స్ట్రైక్స్ *స్టార్ మా మూవీస్: సా.6 గం.కు అమరన్.

News August 15, 2025

EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

image

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>

News August 15, 2025

తిరుపతి IITలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25.