News August 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 15, 2025
ఇవాళ టీవీలో వచ్చే దేశభక్తి సినిమాలు ఇవే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీ ఛానల్స్‌లో ఎన్నో మంచి దేశభక్తి చిత్రాలు ప్రసారం కానున్నాయి. *జెమినీ టీవీ: మ.2.30 గం.కు మేజర్ చంద్రకాంత్ *జెమిని లైఫ్: ఉ.11గం.కు అల్లూరి సీతారామరాజు *జెమిని మూవీస్: మ.1 గం.కు ఖడ్గం, సా.4 గం.కు మహాత్మ, రా.10 గం.కు మేజర్ *జీ తెలుగు: సా.4 గం.కు సుభాష్ చంద్రబోస్ *జీ సినిమాలు: ఉ.9 గం.కు ఉరీ ది సర్జికల్ స్ట్రైక్స్ *స్టార్ మా మూవీస్: సా.6 గం.కు అమరన్.
News August 15, 2025
EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>
News August 15, 2025
అమెరికా బెదిరింపులు.. వెనక్కి తగ్గని భారత్

USటారిఫ్స్ నేపథ్యంలో రష్యన్ ఆయిల్ తక్కువ/ఎక్కువ కొనాలని ఎవరూ చెప్పలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) పేర్కొంది. ‘యథావిధిగా వ్యాపారం చేస్తున్నాం. ఆయిల్ దిగుమతులపై నిలుపదల లేదు. రష్యా ముడి చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అమెరికా/ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎక్కువ కొనండి లేదా తగ్గించండి అని కూడా ఎవరూ చెప్పలేదు’ అని IOC ఛైర్మన్ AS సాహ్ని వెల్లడించారు. రష్యా ఆయిల్‌పై భారత్ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.